Header Banner

ఓరి దేవుడో! భర్త కిడ్నీ అమ్మేసిన భార్య! ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో...

  Sun Feb 02, 2025 20:11        India

భర్తను బురిడీ కొట్టించిన భార్య అతడి కిడ్నీని అమ్మింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త షాక్‌ అయ్యాడు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంక్రైల్ ప్రాంతానికి చెందిన మహిళ ఇంటి ఆర్థిక ఇబ్బందులు, కుమార్తె భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఒక ప్లాన్‌ వేసింది. ఆరోగ్యం కోసం వైద్య చికిత్స అవసరమని భర్తను నమ్మించింది. రహస్యంగా అతడికి సర్జరీ చేయించింది. భర్తను బురిడీ కొట్టించి అతడి కిడ్నీని పది లక్షలకు అమ్మింది. ఆ డబ్బును బ్యాంకులో జమ చేస్తానని భర్తకు చెప్పింది. రాత్రికి రాత్రే ఆ డబ్బు తీసుకుని కుమార్తెతో పాటు ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

కాగా, భార్య, కుమార్తెతో పాటు డబ్బు కనిపించకపోవడంతో భర్త షాక్‌ అయ్యాడు. ఆమె కోసం వెతకగా బరాక్‌పూర్ ప్రాంతంలో ప్రియుడైన పెయింటర్‌తో కలిసి ఆమె నివసిస్తున్నట్లు తెలుసుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమెను నిలదీశాడు. అయితే ఇంటికి తిరిగి రానని భార్య తెగేసి చెప్పింది. అలాగే విడాకుల పత్రాలు పంపుతానని బెదిరించింది. దీంతో భార్య తనను మోసగించినట్లు తెలుసుకున్న భర్త ఆమెపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Kolkata #Kidney #Husband #Wife